ఖమ్మం నగరంలో నిర్వహిస్తున్న స్వచ్ఛత హీ సేవా- 2024 కార్యక్రమంలో నగర ప్రజలను భాగస్వాములుగా చేయాలని కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య అధికారులకు గురువారం సూచించారు. స్వచ్చత హీ సేవా కార్యక్రమంపై శానిటేషన్, ఇంజనీరింగ్ అధికారులతో కమిషనర్ తన చాంబర్లో సమీక్ష నిర్వహించారు. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, తడి, పొడి చెత్త వేర్వేరుగా చెత్త వాహనాలు అందించేలా అవగాహన పెంపొందించాలన్నారు.