సాగర్ కాలువ మర్మతులు తక్షణమే పూర్తి చేసి నీళ్లు విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు బాగం హేమంతరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఖమ్మం జిల్లా నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ గండ్లు తక్షణమే పూర్తి చేసి నీళ్లు విడుదల చేయాలని, ఎండిపోయిన పంటలను కాపాడాలని కోరారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.