వరద ముంపు ప్రాంతాల్లో శానిటేషన్ పనులు దాదాపుగా 85శాతం పూర్తయినట్లు మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. గురువారం ఖమ్మం నగరంలోని రామన్నపేట, బొక్కలగడ్డ, మంచినీటి నగర్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలకుండా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.