సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం అని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. గురువారం ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. 1965లో లాల్ బహుదూర్ శాస్త్రి మంత్రివర్గంలో ఎస్సీ వర్గీకరణకై తొలి అడుగులు పడ్డాయని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్ పాత్ర ఎంత కీలకమో ఎస్సీ వర్గీకరణ పక్రియలో మందకృష్ణ మాదిగ పాత్ర అంత కీలకమన్నారు.