మరో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన
ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ నెల 23 వరకు బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం బలపడి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి చేరే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.