కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి గతేడాది జూలైలో నిర్వహించిన అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈనెల 21న పరిశీలించనున్నట్లు డీఈఓ సోమశేఖర శర్మ శుక్రవారం తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఒరిజనల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ తో పాత డీఈఓ కార్యాలయంలో 21న ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు. కాంట్రాక్ట్ పద్ధతిలో అభ్యర్థులను నియమించనున్నారు.