ఖమ్మం నగరంలోని వెంకటేశ్వర నగర్, పద్మావతి నగర్ ప్రాంతాలలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మున్నేరు వరద బాధితులకు సాయం అందజేశారు. బియ్యం, బట్టలతో పాటు నిత్యవసర సరుకులు కూడా తమ వంతు సహాయంగా అందజేస్తున్నట్లు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ వెల్లడించారు. భవిష్యత్తులో కూడా తమ సహాయ సహకారాలు ఇలానే ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్ పాల్గొన్నారు.