ఖమ్మం నగరంలో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో జిల్లా అగ్నిమాపకశాఖాధికారి అజయ్ కుమార్ ఆధ్వర్యాన వివిధ ప్రాంతాల సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వరదలో చిక్కుకున్న బాధితులను బయటకు తీసుకు రావడంలో పాలుపంచుకున్న వారు ఇప్పుడు బురద, చెత్త పేరుకుపోయిన ప్రాంతాల్లో స్థానికులకు సహకరిస్తున్నారు. మొత్తంగా 11 వాహనాలతో మొత్తం వంద మందికి పైగా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.