ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఫిబ్రవరి 1, 2, 3 వ తేదీలలో జరుగుతున్న భక్త రామదాసు జయంతోత్సవాల సందర్భంగా సోమవారం రాత్రి సౌందర్యలహరి పారాయణ మహిళామండలి భక్తులచే ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మహాళామండలి భక్తులు రామదాసు కీర్తనలు, విష్టుసహస్రనామ పారాయణ, లక్ష్మీసూక్త పారాయణ పఠించారు. ఈ కార్యక్రమంలో భక్తరామదాసు విద్వత్ కళాపీఠం సభ్యులు, మరియు అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.