చిల్లర మాటలు కొడంగల్ లో మాట్లాడు: తాతా మధు
రెండు లక్షల రైతు రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం పచ్చి అబద్ధమని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. కాంగ్రెస్ నేతలకు దమ్ము ఉంటే సెక్యూరిటీని పక్కన పెట్టి గ్రామాల్లో తిరగాలని చెప్పారు. రైతులకు రుణమాఫీ చేయకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించడం మానుకోవాలన్నారు. చిల్లర మాటలు మాట్లాడాలంటే సీఎం పదవికి రాజీనామా చేసి కొడంగల్ లో మాట్లాడుకోమని ఆరోపించారు.