వరదలతో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్దరించేందుకు ఎన్పీడీసీఎల్ రంగంలోకి దిగింది. సీఈలు చౌహాన్, కె. కిషన్ పర్యవేక్షణలో ఖమ్మం సర్కిల్ పరిధిలో విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేశారు. జలమయమైన సబ్ స్టేషన్లలో దెబ్బతిన్న యంత్రాలను మరమ్మతు చేస్తుండగా, వరద ప్రాంతాల్లో కూలిపోయిన ట్రాన్స్ ఫార్మర్లు, స్తంభాల స్థానంలో కొత్తవి అమరుస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మొదలయ్యేలా చర్యలు చేపట్టారు.