ఖమ్మంలో విచిత్ర వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం 5-00 గంటలనుండి వర్షం కురిసి వాతావరణం చల్లబడి ఉందని ఇక ఎండలబాధ ఉండదు అనుకునే లోపే ఉదయం 10-30 నుండి విపరీతమైన ఎండ దంచి కొడుతోంది.
వాతావరణం చల్లబడి ఉందని ఆనందిస్తున్న సమయంలో ఎండ రావడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
మళ్ళీ సాయంత్రం కాగానే చల్లగాలులు వీస్తూ వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. ప్రజలందరూ ఏంటో ఈ వింత వాతావరణం అంటూ ఆశ్చర్యపోతున్నారు.