వరద కారణంగా విద్యార్థులు కోల్పోయిన పాఠ్య పుస్తకాలు, దుస్తులు వెంటనే ప్రభుత్వం విద్యార్థులకు అందించాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ డిమాండ్ చేశారు. మున్నేరు వరదలు ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులలో చేరడంతో బురద పేరుకుపోయిందని చెప్పారు. గురువారం జిల్లా కమిటీ బృందం ఖమ్మం దానవాయిగూడెం గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.