మీ-సేవ కేంద్రాల ద్వారా విచారణకు వచ్చే దరఖాస్తులకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతి జారీ చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఖమ్మం ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్ కంప్యూటర్ ఆపరేటర్ మహేష్ స్టేషన్ పాస్వర్డ్ అక్రమంగా తెలుసుకొని టూటౌన్ పోలీస్ స్టేషన్ ఆపరేటర్ వేణుతో కలిసి ఆర్టీఓ ఏజెంట్తో దందా ప్రారంభించారు. ఇద్దరి కానిస్టేబుల్పై కేసు నమోదు కాగా సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.