బాధితుల ఖాతాల్లో తాత్కాలిక సాయం: మంత్రి

74చూసినవారు
బాధితుల ఖాతాల్లో తాత్కాలిక సాయం: మంత్రి
మున్నేటి వరదతో సర్వస్వం కోల్పోయిన బాధితుల ఖాతాల్లో గురువారం నుంచి రూ. 10వేల తాత్కాలిక సాయం జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మం కేఎంసీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. వరదలు తగ్గిన 40 గంటల్లోనే పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చామన్నారు. ముంపుతో పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. జిల్లా యంత్రాంగాన్ని ఆయన అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్