ఖమ్మం నగరంలో మున్నేరు వరదతో పరివాహక కాలనీలు అతలాకుతలమయ్యాయి. ధంసలాపురంలో వరద ముంపు బాధితులకు పోలీసుల సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తికి గుండెపోటు రావడంతో అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది తక్షణమే స్పందించారు. సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్ లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.