నాగార్జునసాగర్ కాలువకు పడిన గండ్లను త్వరితగతిన పూర్తి చేసి నీరు విడుదల చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్ డిమాండ్ చేశారు. ఎండిపోయిన పంటలను కాపాడాలని కోరుతూ శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. సాగర్ నీరు రాకపోవడంతో వందలాది ఎకరాల వరి పంట ఎండిపోతున్నాయని చెప్పారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న ఆహార పంటలకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు.