ప్రజాస్వామ్య రక్షణే జైబాపు, జైభీమ్, జైసంవిధాన్ లక్ష్యం

82చూసినవారు
ప్రజాస్వామ్య రక్షణే జైబాపు, జైభీమ్, జైసంవిధాన్ లక్ష్యం
ఖమ్మం నగరంలోని 50వ డివిజన్ లో శనివారం జై బాపు, జై భీమ్, జైసంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ పునుకొల్లు నీరజ, కాంగ్రెస్ నగర అధ్యక్షులు ఎండీ జావిద్ పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్