వృద్ధుల జీవితానుభవాల్ని యువతకు అందించాలి

85చూసినవారు
వృద్ధుల జీవితానుభవాల్ని యువతకు అందించాలి
వయోవృద్దులు తమ జీవిత అనుభవాలను యువతరానికి అందించాలని, తద్వారా వారి భవిష్యతకు బాటలు వేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కోరారు. ఖమ్మంలోని టీటీడీసీలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవం, బాలికల దినోత్సవంలో ఆయన మాట్లాడారు. సమాజంలో విలువలు కొనసాగడానికి వృద్ధులే కారణమని తెలిపారు. ఈ విషయాన్ని నేటి తరం గుర్తించి వయోవృద్దులను గౌరవించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్