నీట్ ఫలితాలపై విచారణ జరిపించాలి

59చూసినవారు
నీట్ ఫలితాలపై విచారణ జరిపించాలి
నీట్ యూజీ- 2024 పరీక్షను సక్రమంగా నిర్వహించలేదని, విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, వెంటనే ఈ పరీక్ష నిర్వహణ, ఫలితాలపై విచారణ జరిపించి రద్దు చేయాలని పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. నీట్ ఫలితాలలో 67 మంది విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ రావడంతో అనేక అనుమానాలకు తావిస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్