వీధిదీపాలు వెలగక ఇక్కట్లు

57చూసినవారు
వీధిదీపాలు వెలగక ఇక్కట్లు
ఖమ్మం పట్టణంలో 26వ డివిజన్ ప్రభాత్ టాకీస్ దగ్గర నుండి రామాలయం గల్లీలోకి వెళ్ళే దారిలో గత ఐదు రోజుల నుండి తెల్లవారుజామున సుమారు 3-00 గంటల నుండి వీధి దీపాలు వెలగక స్థానికులు అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు ఆ దారినిండా వీధి కుక్కల అరుపులతో ఆ ప్రాంతమంతా గందరగోళంగా మారింది. పాదచారులవెంట, వాహనాలపై వెళ్లే వారిని కూడా శునకాలు వెంటబడి తరుముతున్నాయి.
ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని స్థానికులు, ప్రజలు కోరుచున్నారు.

సంబంధిత పోస్ట్