ముచ్చర్లలో నాటేసి నిరసన వ్యక్తం చేసిన మహిళలు

70చూసినవారు
ముచ్చర్లలో నాటేసి నిరసన వ్యక్తం చేసిన మహిళలు
కామేపల్లి మండలం ముచ్చర్ల బీసీ కాలనీలో ప్రధాన రహదారిపై భారీగా ఏర్పడిన గుంతలు చిన్నపాటి జలాశయాన్ని తలపిస్తుంది. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే రహదారిపై నెలలు గడుస్తున్నా ఆర్అండ్ బి శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ మరమ్మతు పనులు చేపట్ట కపోవడంతో స్థానిక మహిళలు శుక్రవారం రహదారిపై నాటేస్తూ నిరసన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్