2019 నుంచి వివిధ క్రీడాంశాల్లో రాణిస్తున్న జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుల వరకు ఈ నెల 23లోపు దరఖాస్తు చేసుకోవాలని డీవైఎస్ఓ సునీల్ కుమార్ రెడ్డి శుక్రవారం తెలిపారు. భవిష్యత్ లో ఉత్తమ క్రీడాకారులుగా గుర్తించేందుకు ఈ దరఖాస్తులు ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. క్రీడల్లో సాధించిన సర్టిఫికెట్లు, పతకాలు, అధార్ కార్డులను పొందుపర్చిన దరఖాస్తులను జిల్లా యువజన క్రీడల శాఖ కార్యాలయంకు పంపించాలని సూచించారు.