తిరుమలాయపాలెం: గ్రామ పురవీధులలో నరసింహస్వామి ఊరేగింపు

75చూసినవారు
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు గ్రామంలో వేంచేసియున్న శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాతసేవ, మంగళ నీరాజనాలు, మేలుకొలుపు జరిగిన అనంతరం ఉత్తర ద్వారదర్శనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారిని గ్రామ పురవీధులలో ఊరేగించి భక్తులకు దర్శనం కల్పించారు.