కేంద్రం విధానాలకు నిరసనగా రేపు బ్లాక్ డే

59చూసినవారు
కేంద్రం విధానాలకు నిరసనగా రేపు బ్లాక్ డే
కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కిసాన్ సంయుక్త మోర్చా పిలుపులో భాగంగా ఈనెల 23న సోమవారం దేశవ్యాప్తంగా నిర్వహించే బ్లాక్ డేను జయప్రదం చేయాలని కార్మిక, రైతు సంఘాల అఖిలపక్షం నాయకులు పిలుపునిచ్చారు. ఖమ్మంలోని మంచికంటి భవన్లో శనివారం జరిగిన సమావేశానికి ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎం. డీ. వై. పాషా అధ్యక్షత వహించగా పలువురు మాట్లాడారు.

సంబంధిత పోస్ట్