ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ పారదర్శకంగా సాగేలా పర్యవేక్షించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఖమ్మం కలెక్టరేట్లో బుధవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకేచోట నాలుగేళ్ల సర్వీస్ పూర్తయిన వారిని తప్పనిసరి బదిలీ చేయాల్సి ఉండగా, రెండేళ్ల సర్వీస్ పూర్తయిన వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రతీ శాఖ పరిధిలోని ఖాళీల జాబితా ప్రదర్శించాలని సూచించారు.