అండర్-23 విభాగంలో అథ్లెటిక్స్ ఎంపిక పోటీలను ఈనెల 4న నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మందుల వెంకటేశ్వర్లు, ఎం. డీ. షఫీక్ అహ్మద్ తెలిపారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగే ఎంపిక పోటీలకు క్రీడాకారుల వయసు ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 8 గంటలకల్లా హాజరుకావాలని సూచించారు. ఇక్కడ ప్రతిభ చాటిన వారిని రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ టోర్నీకి ఎంపిక చేస్తామని తెలిపారు.