ఖమ్మం నగరం వన్ టౌన్ 26వ డివిజన్ రామాలయం వీధిలో నుండి బ్రాహ్మణ బజార్ కు వెళ్ళే గల్లీలో గత నాలుగు రోజుల నుండి రాత్రిపూట వీధిలైట్లు వెలగక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. చీకటిగా ఉండటంతో కుక్కల అరుపులతో ఆ ప్రాంతమంతా గందరగోళంగా మారింది. తెల్లవారుజామున పాలుపోసే వారి వాహనముల వెంట, ట్యూషన్ కు వెళ్ళే విద్యార్థుల వెంట కుక్కలు వెంటపడుతున్నాయి. స్థానికులు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.