ఖమ్మం జిల్లా పెనుబల్లిలో శ్రీ కోదండరామాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉత్తర ద్వారదర్శనం మరియు కోవెలసేవ నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున గం 5-30 నిమిషాలకు ఉత్ర ద్వార దర్శనంలో దర్శనమిచ్చిన స్వామిని భక్తులు తిలకించి రామచంద్ర ప్రభువుకు జై అంటూ అత్యధిక సంఖ్యలో భక్తులు రామయ్యను దర్శించుకున్నారు.