ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ) ముఖ్య కార్యనిర్వహణాధికారి( సీఈఓ)గా జనరల్ మేనేజర్ వి. వసంతరావుకు బుధవారం బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు సీఈఓగా ఉన్న అబీద్ ఉర్ రెహమాన్ను రుణమాఫీ, ఇతర అంశాలపై వచ్చిన ఆరోపణలతో సస్పెండ్ అయిన విషయం విదితమే. దీంతో ప్రస్తుతం ప్రధాన కార్యాలయంలో జీఎంగా ఉన్న వసంతరావుకు చైర్మన్ వెంకటేశ్వరరావు సీఈఓగా బాధ్యతలు అప్పగించడంతో ఆయన విధుల్లో చేరారు.