ఖమ్మం వరద బాధితుల సహాయార్థం వీవీసీ విద్యాసంస్థల యాజమాన్యం ముందుకొచ్చింది. బుధవారం ఖమ్మం నగరంలోని వీవీసీ పాఠశాల వద్ద వరద సహాయ నిధికి రూ. 2. 40, 000 రూపాయల చెక్కును విద్యార్థుల చేతు మీదుగా మంత్రి తుమ్మల నాగేశ్వరావుకు అందజేశారు. కార్యక్రమంలో విద్యాసంస్థల యాజమాన్యం, అధ్యాపకులు, కార్పొరేటర్ కమర్తపు మురళీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.