జలవనరుల శాఖ నష్టం రూ. 50కోట్ల పైగానే..

70చూసినవారు
ఖమ్మం జిల్లాలో వరద కారణంగా జల వనరుల శాఖకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఓ వైపు వేలాది కుటుంబాలను ముంచెత్తిన వరద. ఇంకోవైపు అనేక చెరువులు, కాల్వలకు గండ్లు పడడానికి కారణమైంది. జిల్లాలో చెరువులు, కాల్వలకు 90చోట్ల గండ్లు పడి కోతకు గురయ్యాయని అధికారులు గుర్తించారు. వాటి మరమ్మతుల కోసం రూ. 50 కోట్ల మేర ఖర్చవుతుందని జలవనరులశాఖ అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు.