గత ప్రభుత్వం కంటే తాము ఖమ్మం జిల్లాకి పెద్దపీట వేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం ఖమ్మం పర్యటనలో భాగంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. మంత్రి పదవిలో కీలక శాఖలు ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖమ్మం జిల్లాకే అప్పజెప్పామని సీఎం చెప్పారు.