ఖమ్మం జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం వారి కార్యాలయంలో ప్రత్యేక పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. పంట వేసిన వారికే రైతు బంధు ఇస్తామని అది కూడా భూమి యజమాని లేదా కౌలు రైతు ఎవరో ఒకరికే రైతు బంధు ఇస్తామని ఆ ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలి అనేది వాళ్ళిద్దరూ మాట్లాడుకొని తేల్చు కోవాలనని అన్నారు.