మున్నేరు ప్రవాహం పెరిగే సూచనలు ఉన్నందున 13 డివిజన్ల కార్పొరేటర్లతో ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో కేఎంసీ కమిషనర్ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మున్నేరు నీటిమట్టం 13 అడుగులు ఉన్నందున, 16 అడుగులకు రాగానే డివిజన్ కార్పొరేటర్లకు అలెర్ట్ చేస్తామని, అధికారుల సమన్వయంతో ముంపు ప్రాంతాల ప్రజలను బయటికి తీసుకురావాలని సూచించారు. నీటి ప్రవాహం భారీగా పెరిగితే ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.