మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన సంకల్ప దీక్షగా చేపట్టామని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల పరిధిలోని మున్నేరు వరద పరీవాహక ప్రాంతాలైన బొక్కలగడ్డ, మంచికంటినగర్, పద్మావతినగర్, కరుణగిరి, సాయిప్రభాత్నగర్, రాజీవ్ గృహకల్ప, దివ్యాంగుల కాలనీల్లో పనులు, వైద్యశిబిరాలను బుధవారం పరిశీలించారు. అనంతరం పలువురి ఇళ్లకు వెళ్లి వరద నష్టంపై ఆరా తీసి ఓదార్చారు.