ఆళ్ళపల్లి మండలంలోని అనంతోగు- కాచనపల్లి ప్రధాన రహదారిలో ఆదివారం ఓ మలుపు వద్ద ఎరువుల లారీ అదుపు తప్పి గోతిలో పడే ప్రమాదం తృటిలో తప్పింది. స్థానికుల వివరాల ప్రకారం.. కోదాడ నుంచి మండలంలోని మర్కోడు గ్రామం వస్తున్న లారీకి అనంతోగు నుండి కాంచనపల్లి గ్రామం వెళ్తున్న లారీకి ట్రాక్టర్ సైడ్ ఇవ్వక లారీ అదుపుతప్పి గోతిలో పడబోయి ఓ పక్కకు ఒరిగిందని తెలిపారు. డబుల్ రోడ్డు వేయాలని ప్రజలు ఎమ్మెల్యేను కోరుతున్నారు.