భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెంలోని సుజాతనగర్ కాలనీలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రి దినేష్ అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు ఆ బాలుడిని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఛత్తీస్ ఘడ్ నుండి దినేష్ కుటుంబం ములకలపల్లికి వలస వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.