బీజేపీ సభ్యత్వ నమోదుకు ప్రచారం

62చూసినవారు
బీజేపీ సభ్యత్వ నమోదుకు ప్రచారం
బీజేపీ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని కోరుతూ ప్రచారం చేస్తున్నట్లు 7వ డివిజన్ కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు పార్టీ ఖమ్మం టౌన్ అధ్యక్షుడు కుమిలి శ్రీనివాసరావు ఆధ్వర్యాన చేసిన ప్రచార ఆటోను రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. బీజేపీ సభ్యత్వ నమోదును ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రచార వాహనం ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. అల్లిక అంజయ్య, అంజన్న ఉన్నారు.

సంబంధిత పోస్ట్