మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన ఇద్దరిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు జీఆర్పీ సీఐ అంజలి తెలిపారు. మధిరలో ఈనెల 2న శాతవాహన ఎక్స్ప్రెస్ దిగుతున్న మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లే క్రమాన సగం మేర తెగిపోవడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఖమ్మం స్టేషన్లో తనిఖీ చేస్తుండగా చింతకాని మండలం లచ్చగూడెంకు చెందిన కే. రామకృష్ణ అనుమానాస్పదంగా కనిపించడంతో ప్రశ్నించగా చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు.