కొత్తగూడెం: 1. 92 క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత

66చూసినవారు
కొత్తగూడెం: 1. 92 క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత
కొత్తగూడెం మేదరబస్తీకి చెందిన దివాకర్ రాజు నాటుసారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం, పటిక అమ్ముతున్నాడనే సమాచారం మేరకు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీం అతడి ఇంట్లో తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో 1. 92 క్వింటాళ్ల నల్లబెల్లం, ఐదు కేజీల పటిక పట్టుకున్నామని ఎక్సైజ్ ఎస్ఐ కరమ్ చాంద్ తెలిపారు. దివాకర్ రాజు కొంతకాలంగా నాటుసారా తయారీదారులకు నల్లబెల్లం, పటిక అమ్ముతున్నాడని, ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేశామని చెప్పారు.

సంబంధిత పోస్ట్