కొత్తగూడెం: చైన్ స్నాచింగ్ కలకలం

71చూసినవారు
కొత్తగూడెం: చైన్ స్నాచింగ్ కలకలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. పాల్వంచ ఒడ్డుగూడెం ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని మరో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వెంబడించారు. క్షణాల వ్యవధిలో అతని మెడలో ఉన్న సుమారు రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యారు. ఈ ఘటనతో బాధితుడు షాక్‌కు గురయ్యాడు. సీసీ కెమెరాల ఆధారంగా దుండగులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

సంబంధిత పోస్ట్