కొత్తగూడెం నియోజకవర్గంలో నేడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి శనివారం పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కలెక్టరేట్లో రూ. 7 కోట్ల నిధులతో విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. రాజాపురంలో రూ. 9 కోట్లు, సోములగూడెంలో రూ. 4 కోట్లతో హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.