కొత్తగూడెం జిల్లాలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర మంత్రి శ్రీనివాసరెడ్డి సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలని టీయూడబ్ల్యూజే ఐజేయూ కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్ ఆదివారం మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల సమస్యలపై స్పందించిన మంత్రి త్వరలో ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు.