‘నేను ఆమెను ఇష్టపడ్డాను!’.. అంటూ ఓ టీచర్ గందరగోళం సృష్టించడంతో పీటలపై పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటు చేసుకుంది. యువతి, ఖమ్మంకు చెందిన ఓ టీచర్ రెండో వివాహానికి సిద్ధమయ్యారు. శనివారం సాయంత్రం అక్కడకు చేరుకున్న మరో టీచర్ గుండాల ‘వధువంటే నాకు ఇష్టం. నా భార్యకు విడాకులు ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటాను’ అని రచ్చ చేయడంతో పెళ్లి ఆగిపోయింది. వధువు పోలీసులకు ఫిర్యాదు చేసింది.