భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ దారి దోపిడీ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ పరిధిలోని కరకవాగు నుంచి సోనియా నగర్ కి వెళ్లే రహదారిపై బైక్ మీద తిరుమల రాజు అతని బావ వెళుతుండగా శేఖరం బంజర రైల్వే ట్రాక్ సమీపంలో ఆటోలో గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు వచ్చి బైకును అడ్డగించి తిరుమల రాజు అనే వ్యక్తి పై దాడి చేసి అతని వద్ద ఒక సెల్ ఫోన్, 5000 రూపాయల నగదును అపహరించికేళ్ళారని పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ లో బాధితుడు తిరుమలరాజు ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన పాల్వంచ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.