ఆళ్లపాడు: భాగం ఫౌండేషన్ నిర్వాహకులు ఆర్థిక సహాయం

4చూసినవారు
ఆళ్లపాడు: భాగం ఫౌండేషన్ నిర్వాహకులు ఆర్థిక సహాయం
ఇటీవల తాటి చెట్టుపై నుండి ప్రమాదవశాత్తు కిందపడి మరణించిన గీత కార్మికుడి కుటుంబానికి భాగం సేవా ఫౌండేషన్ నిర్వాహకులు రాకేష్ శనివారం రూ. 5 వేలు ఆర్థిక సహాయం అందించారు. మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామానికి చెందిన మంద రాములు ఇటీవల ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి కిందపడి మరణించిన ఘటన విధితమే. ఫౌండేషన్ సభ్యులు రాధాకృష్ణ మాట్లాడుతూ మృతుడి కుటుంబంలోని చిన్నారుల చదువుల అవసరాల నిమిత్తం సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్