వెంకటరెడ్డి కస్టడీ పిటిషన్పై నేడు తీర్పు
గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి కస్టడీ పిటిషన్పై మంగళవారం తుది తీర్పు వెల్లడికానుంది. వైసీపీ హయాంలో చోటు చేసుకున్న ఇసుక కుంభకోణానికి సంబంధించి మరిన్ని వివరాలు సేకరించేందుకు వెంకటరెడ్డిని విచారించాల్సి ఉందని, ఏడు రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని ఏసీబీ తరఫు న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై నిన్న విచారణ జరిగింది. ఇవాళ తుది తీర్పు వెల్లడించనున్నారు.