మధిర పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద గత కొన్ని రోజుల క్రితం డ్రైనేజీ పూడిక కోసం తీసిన గుంతలు తిరిగి పూడ్చకుండా అలాగే వదిలేయడంతో అది ప్రమాదాలకు నిలయంగా మారి రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ప్రజలు వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.