తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యా సంస్థల బంద్ మధిర మండలంలో విజయవంతం అయిందని జిల్లా ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఈ బందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.